ఆ స్టార్ హీరో కోసం కీర్తి సురేష్ ఏం చేసిందో తెలుసా..!

-

ఇవాళ తమిళ స్టార్ హీరో విజయ్ జన్మదినం కావడంతో అభిమానులు, సెలబ్రెటీలు సోషల్‌మీడియాలో పోస్టులతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నటి కీర్తి సురేష్ విజయ్ బర్త్ డే కోసం స్పెషల్ గా గిటార్ వాయించి విషెస్ చెప్పింది. విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని కుట్టి స్టోరీ పాటను వయోలిన్ ద్వారా వాయించి వినిపించారు. తాను గిటార్ వాయిస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ “జీవితం చాలా చిన్నది నన్బా.. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్ డే విజయ్ సార్. మీ కోసం చిన్న వీడియో” అంటూ ట్యాగ్ జత చేసింది కీర్తి. దీంతో కీర్తి మంచి నటే కాదు.. సంగీత కళాకారిణి కూడా నీలో దాగుందా అంటూ కీర్తిని ప్రసంసిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో దాదాపు 3 లక్షల మంది కీర్తి వీడియోని వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news