PushpaTheRule : పుష్ప 2 నుంచి కేశవ లుక్ లీక్..విలన్‌ అవతారం ఎత్తాడా ?

-

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్.

అయితే.. పుష్ప 2 సినిమాలో ఓ బాలీవుడ్ హీరో కూడా నటించనున్నాడట. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెలలో ప్రారంభం కానుందని నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. దానికి తగ్గట్టుగానే.. తాజాగా ఈ సినిమాలోని కేశవ లుక్‌ లీక్‌ అయింది. కేశవ లుక్‌ లీక్‌ కావడంతో.. పుష్ప2 సినిమా సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ గా మారింది.

అయితే.. పుష్ప 1 లో కంటే.. సెకండ్‌ పార్ట్‌ లో కేశవ చాలా మారిపోయినట్లు కనిపిస్తోంది. కేశవ లుక్ చూస్తుంటే అల్లు అర్జున్ గెటప్ లాగా అనిపిస్తుంది. అలాగే కేశవ ప్రవర్తన, ఫేస్‌ ఎక్స్‌ ప్రెషన్‌ చూస్తుంటే.. పుష్ప కి పార్ట్‌ 2 లో వెన్నుపోటు పొడిచే సీన్ లా కనిపిస్తుంది. అంటే పుష్ప2 కేశవ విలన్‌ అవుతాడా అనే డౌట్స్‌ వస్తున్నాయి. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news