ఫామ్ హౌస్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేసిన విషయంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే కోర్టులు, చట్టాలు అవసరం లేదన్నారు. రేపిస్టులను సన్మానించిన చరిత్ర బిజెపిదని.. అలాంటి వాళ్ళ ప్రమాణాలకు విలువ ఏముంటుందని అన్నారు.

అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం అంటే పాపం అని అన్నారు. దయచేసి సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నానని అన్నారు మంత్రి కేటీఆర్. అలాగే బిజెపిపై చార్జి షీట్ వేస్తున్నామని వెల్లడించారు. బీసీ జనగణ చేయకుండా, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకుండా, విభజన చట్టాన్ని అమలు చేయకపోవడంపై చార్జిషీట్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ కార్పోరేట్ దోస్తులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రూ. 16.50 లక్షల కోట్లను బడా వ్యాపారవేత్తలకు మాఫీ చేసి.. పేదల సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలు అంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news