BREAKING : కేటీఆర్ కు షాక్.. నేడు బీజేపీలో చేరనున్న సిరిసిల్లా BRS కీలక నేత

-

మంత్రి కేటీఆర్‌ కు తన సొంత ఇలాక అయిన సిరిసిల్లాలో బిగ్‌ షాక్‌ తగిలింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన వైస్ చైర్మన్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షులు లగిశెట్టి శ్రీనివాస్ ఇంటికి ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తేనేటి విందుకు హాజరయ్యారు.

గత కొంతకాలంగా లభిశెట్టి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంత్రి కేటీఆర్ తలను పట్టించుకోవడంలేదని అలాగే ప్రజా సమస్యలు అడిగినా కూడా స్పందించడం లేదని అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే లగిశెట్టి శ్రీనివాస్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు లగిశెట్టి శ్రీనివాస్. బండి సంజయ్‌ సమక్షంలో లగిశెట్టి శ్రీనివాస్… బీజేపీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news