ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎప్ చాప్టర్ 1’ క్రియేట్ చేసిన హిస్టరీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాప్టర్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాప్టర్ 2 సినిమా విడుదలైంది.
రాకింగ్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. అయితే, చాప్టర్ 1తో పోలిస్తే చాప్టర్ 2లో భారీ తారగణమే ఉంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ యాక్టర్ రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు.
రాఖీ భాయ్ గా యశ్ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేయగా, ఆ వెయిట్ పూర్తయింది. సినిమాను నెక్స్ట్ లెవల్ లో డైరెక్టర్, మూవీ యూనిట్ సభ్యులు ప్రమోట్ చేశారు. డైరెక్టర్, హీరో దేశవ్యాప్తంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని, అమ్మ సెంటిమెంట్ తో పాటు రాఖీ భాయ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయని తెలిపారు. ఎట్టకేలకు గురువారం ఈ సినిమా విడుదలైంది.
‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా స్టోరి విషయానికొస్తే..చాప్టర్ 1 ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచే చాప్టర్ టూ స్టార్ట్ అవుతుంది. అనంత నాగ్ ప్లేస్ లో నెరేటర్ గా చాప్టర్ 2 లో ప్రకాశ్ రాజ్ కనిపించారు. చాప్టర్ వన్ గరుడను చంపడంతో ముగుస్తుందన్న సంగతి అందరికీ విదితమే. గరుడ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ కార్మికులు రాఖీ భాయ్ ను చూసి సంతోషిస్తారు. రాఖీ భాయ్ ఆ కేజీఎఫ్ కు రాజు అవుతాడు.
ఈ క్రమంలోనే రాఖీ భాయ్ కు ఇటువంటి KGFలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. వాటిని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అలా తను ఇంకా శక్తిమంతమైన రాజు కావాలనుకుంటాడు. ఇక రీనా(హీరోయిన్ శ్రీనిధిశెట్టి) ఫాదర్ రాజేంద్ర దేశాయ్, గరుడ బ్రదర్ దయా, ఆండ్రూస్ అందరూ ఓ కూటమిగా ఏర్పడుతారు. ఈ విషయం రాఖీకి తెలుస్తుంది. దాంతో తొలుత రీనాను తన కేజీఎఫ్ కు తీసుకెళ్తాడు. అక్కడే రాఖీ భాయ్ సేఫ్ గా ఉంటాడు.
రాఖీ భాయ్ అక్కడే ఉంటే ఏం చేయలేమని, రాఖీని బయటకు తీసుకురావాలని రాజేంద్ర దేశాయ్ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ టైంలో వారికి అధీర బతికే ఉన్నాడన్న నిజం తెలుస్తుంది. రాజేంద్ర దేశాయ్ టీమ్ ఎట్టకేలకు రాఖీ భాయ్ ను బయటకు తీసుకురాగా, అప్పుడు అధీర తన అసలు రూపం చూపించి, రాఖీని దెబ్బకొడతాడు. అలా రాఖీ భాయ్, అధిర మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతుంది.
ఈ క్రమంలోనే అధీరను రాఖీ భాయ్ ఎలా ఎదుర్కొన్నాడు? KGFను లాక్కోవాలని ప్రధాన మంత్రి ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంది? పీఎంను సైతం రాఖీ భాయ్ ఎలా ఎదుర్కొంటాడు? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపైన పూర్తి సినిమా చూడాల్సిందే.
సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సీబీఐ ఆఫీసర్ గా రావు రమేశ్, వారి పాత్రల పరిధిలో ప్రకాశ్ రాజ్, రవీనా టండన్ లు చాలా బాగా యాక్ట్ చేశారు. పిక్చర్ కు ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ, యశ్ నటన, యాక్షన్ సీక్వెన్సెస్, నటీ నటుల పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.
పాన్ ఇండియా ఫిల్మ్: కేజీఎఫ్ చాప్టర్ 2
స్టోరి, డైరెక్షన్: ప్రశాంత్ నీల్
ప్రొడక్షన్ హౌస్: హొంబలే ఫిల్మ్స్
రిలీజ్ డేట్: ఏప్రిల్ 14, 2022
హీరో, హీరోయిన్: యశ్, శ్రీనిధిశెట్టి
ప్రధాన పాత్రధారులు: సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు