ఇండియాకు సీఎం కేసీఆర్ సేవలు అవసరమన్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఇన్ కం ట్యాక్స్ ప్రజలకు యూజ్ లెస్ ట్యాక్స్… ప్రధాని మోడీకి సింపుల్ అర్థమెటిక్ కూడా తెలియదని చురకలు అంటించారు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పేవారే లేరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. ఐటీ, ఈడీ దాడులు పత్రికల్లో ఏం రావాలో పీఎంవో నిర్దేశిస్తుందని ఆగ్రహించారు. ఇలాగే కొనసాగితే.. దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరించారు.
దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని.. కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషించలేకపోతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని.. ఆర్థిక రంగంపై మోడీకి కనీస అవగాహన లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. చాలా కష్టం అని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలు మెచ్చే నాయకుడని.. జాతీయ స్థాయిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నెహ్రూ మొదలు మోడీ వరకు రైతులంటే టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా చూశారని మండిపడ్డారు.