కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న KGF2..ఐదు రోజుల్లో రూ.600 కోట్లు

-

కన్నడ చిత్రసీమ దేశంలో అన్ని ఇండస్ట్రీల కంటే చాలా చిన్నదని అందరూ అనుకునేవారు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. శాండల్ వుడ్ ఫిల్మ్ KGF2.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగ రాసే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా..ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకుంటున్నది.

సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా రాఖీ భాయ్ బాక్సాఫీసుకు మొగుడు అయిపోయాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నిటినీ మూలకు పడేలా చేశాడు. ఐదో రోజు ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం విశేషం.

బాలీవుడ్ లో ఈ ఫిల్మ్ వర్కవుట్ కావడం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ గా ఇది కన్నడ మూవీ, కాగా, హిందీలోకి డబ్ అయింది. అటువంటి డబ్ ఫిల్మ్.. ఈ రేంజ్ లో సత్తా చాటుతుందని ఎవరూ ఊహించలేదు. రూ.100 కోట్లు, రూ.200 కోట్లోనే అతి తక్కువ టైంలో రీచ్ అయిన సినిమాగా KGF2 నిలిచింది.

ఈ కలెక్షన్స్ ఇలానే కొనసాగితే అతి త్వరలోనే KGF2 ఫిల్మ్ రూ.1,000 కోట్ల రికార్డను బద్ధలు కొడుతుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. RRR రికార్డును సైతం బీట్ చేసే చాన్స్ అలా KGF2 దక్కుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల KGF2 మూవీ యూనిట్ సభ్యులు, డైరెక్టర్, హీరో, హీరోయిన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరో యశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news