ఇండియా కూటమి గెలిచే ఎంపీ సీట్లు ఎన్నో చెప్పేసిన ఖర్గే..!

-

పార్లమెంట్ ఎన్నికల ముగింపు నేపథ్యంలో ఇవాళ ఇండియా కూటమి కీలక నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో.. ఎన్నికల పోలింగ్ సరళి, ఫలితాల విడుదల తదితర అంశాలపై డిస్కస్ చేశారు. ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి 295కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది మా సర్వే కాదు.. ప్రజలు చేసిన సర్వే అని అన్నారు. కాగా, 400 సీట్లు గెలిచే హ్యాట్రిక్ కొడతామని బీజేపీ అంటుండగా.. 295కు పైగా సీట్లు సాధించి బీజేపీని గద్దె దించుతామని ఖర్గే అనడం ఉత్కంఠ రేపుతోంది. మరీ ఏడు దశల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా.. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష కూటమి అధికారం దక్కించుకుంటుందా అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news