ఆ ట్రోల్స్ ని ఎంజాయ్ చేశా: కియారా

-

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది కైరా అద్వాని. అంతకు ముందు ఎం.ఎస్ ధోని బయోపిక్ గా తెరకెక్కిన ధోని చిత్రంతో దేశ ప్రజలందిరిని ఆకర్షించింది. లస్ట్ స్టొరీస్ తో తనలో కియారా అద్వానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఆ తర్వాత తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో కియారాకి బాలివుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి.

అయితే తనపై వచ్చిన ట్రోల్స్ ని బాగా ఎంజాయ్ చేశానని నటి కియారా అద్వానీ తెలిపింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రత్నాని క్యాలెండర్ కోసం కైరా టాప్ లెస్ గా ఫొటో దిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది.ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఈ ఫొటోని చూసిన నెటిజన్లు తమకు ఇష్ట వచ్చినట్లు మీమ్స్ క్రియేట్ చేస్తూ కియారాని ట్రోల్ చేశారు. అయితే ఇవన్నీ చూసిన కియారా ఆ ట్రోల్స్ ని చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్నింటిని తాను కూడా షేర్ చేసిందట. అయితే ఓ దశలో ఇన్ స్టాగ్రమ్ DM నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేయల్సి వచ్చిందని కైరా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news