మహబూబాబాద్ లో కిడ్నాపైన బాలుడు దీక్షిత్ తల్లికి మరో సారి ఫోన్ చేశాడు కిడ్నాపర్. 45 లక్షలు రెడీ చేసుకోవాలని, ఎక్కడ ఇవ్వాలో రేపు ఫోన్ చేసి చెబుతానని పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే తమ వద్ద అంత డబ్బు లేదు, కొంతమొత్తం రెడీ చేశామని తల్లి వసంత పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే డబ్బు అరెంజ్ చేయాల్సిందేనని కిడ్నాపర్ ఫోన్ కట్ చేసినట్టు సమాచారం. ఫోన్ కాల్ లోకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు ఈ ఫోన్ కాల్స్ బీహార్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు.
దీంతో పోలీసులకు దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం సవాల్ గా మారింది. బాలుడి తండ్రి జర్నలిస్ట్ కావడంతో జర్నలిస్ట్ సంఘాలు డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళాయి. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి పరిస్థితిపై ఆరా తీశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఏమాత్రం కన్పించని పురోగతి లభించకపోవడంతో రంగంలోకి ఐటీ కోర్, టాస్క్ఫోర్స్, ఇంటలిజెన్స్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు దిగాయి.