హీరో మోటొకార్ప్ అదిరే ఆఫర్ : కేవలం రూ.4,999 చెల్లించి మీకు కలవాల్సిన బైక్ ఇంటికి తీసుకెళ్లండి…!

-

పండుగ సమయంలో మీరు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నా.. లేదా మీ ఇంట్లో వారికి స్కూటర్ బహుమతి ఇద్దామని భావిస్తున్న వాళ్ళకి శుభవార్త. హీరో మోటొకార్ప్ సంస్థ కస్టమర్లుకు అదిరిపోయే పండుగ ఆఫర్స్ తీసుకొచ్చింది. కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారికీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పండుగ సీజన్ సందర్భంలో అనేక టూవీలర్ తయారీ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పలు రకాల ఆఫర్లతో ముందుకు వస్తూనే ఉంటాయి. అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటొకార్ప్ కూడా అదే తరహాలో కస్టమర్లుకు అదిరే ఆఫర్ తీసుకువచ్చింది.

హీరో మోటొకార్ప్ పండుగ ఆఫర్‌లో భాగంగా స్కూటర్ కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్ పొందొచ్చు. కస్టమర్లు బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరో బంపర్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.4,999 డౌన్ పేమెంట్ చెల్లించి కస్టమర్లు నచ్చిన స్కూటర్ లేదా హీరో బైక్ హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లొచ్చు. మిగిలిన మొతాన్ని ఈఎంఐ రూపంలో వారు చెల్లించొచ్చు. అది కూడా అతి తక్కువ వడ్డీ రేటుతో చెల్లించవచ్చు. వడ్డీ రేట్లు 6.9 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కానీ, ఈ ఆఫర్ పరిమిత కలం వరకే వర్తిస్తుంది. పేటీఎం ద్వారా లావాదేవీ నిర్వహిస్తే రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈఎంఐపై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 , ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ వెహికల్స్‌పై కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. లాయల్టీ టాపప్ కింద రూ.2,000 వరకు, ఎక్స్చేంజ్ టాపప్ కింద రూ.3,000 వరకు కార్పొరేట్ భాగస్వామ్యం కింద రూ.2,000 వరకు మొత్తంగా రూ.7,000 వరకు లాభం పొందొచ్చు. ఇకపోతే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏకంగా రూ.15,000 తగ్గింపు లభిస్తోంది. హీరో ఆప్టిమా హెచ్‌ఎక్స్ సిటీ స్పీడ్ స్కూటర్ ధర రూ.71,950 అయితే దీనిపై రూ.14,390 డిస్కౌంట్ లభించటంతో ఈ స్కూటర్‌ను రూ.57,560కు పొందొచ్చు. కానీ ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే . కేవలం స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news