ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేదలందరికీ ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థితి బాగా లేని ఎంతోమంది నిరుపేదలకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. పలు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ పథకం విషయంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది . ఇప్పటికే ఆరోగ్య శ్రీ లో ఎన్నో రకాల సేవలు అందిస్తుండగా… ఇప్పుడు కిడ్నీ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చారు. కిడ్నీ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నిరుపేదల అందరికీ ఎంతో భారంగా మారిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.