బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పగ్గాలు చేపట్టే ముహూర్తం ఖరారు…

-

బీజేపీ అధిష్టానము తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని సకల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడానికి కూడా కొన్ని సార్లు చూస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ను ఇటీవల తప్పించి, ఆ స్థానంలో కేంద్ర సహాయమంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఆ పదవిని అప్పగించింది. అయితే ఇద్దరూ బలమైన నాయకులు కావడంతో బీజేపీలో పెద్దగా లుకలుకలు బయటపడలేదు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణాలో అధికారంలోకి రావడం కోసం కస్టపడి పనిచేస్తామని బీజేపీ కీలక నేతలు అందరూ అధిష్టానానికి నమ్మకాన్ని కలిగించారు. కాగా కిషన్ రెడ్డి కి ఈ పదవిని ఇచ్చి రెండు వారాలు అవుతున్నా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.

సరైన ముహూర్తం కోసం వెతికి ఫైనల్ గా కాసేపటి క్రితమే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చేప్పట్టబోయే డేట్ ను ఖరారు చేశారు. అధికారిక సమాచారం ప్రకారం జులై 21న తన బాధ్యతలను స్వీకరించనున్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news