డార్క్‌ నెట్‌పై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు..

-

‘సైబర్ ఫెయిల్యూర్ వరల్డ్’ను కాకుండా ‘సైబర్ సక్సెస్ వరల్డ్’ను సృష్టించడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. “అందరం కలిసి ఈ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలం, అదే సమయంలో అందరికీ సురక్షితమైన-సంపన్నమైన డిజిటల్ భవిష్యత్తును నిర్ధారించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పరం సహకరించుకుంటూ, మన ఆలోచనలను పంచుకుంటూ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించుకుందామని” ఆయ‌న అన్నారు.

Home Minister Amit Shah to launch cyber volunteer squads at G20 conference  in Gurgaon | Delhi News, The Indian Express

ఉగ్రవాదులు తమ గుర్తింపును దాచి పెట్టేందుకు, రాడికల్ విషయాలను వ్యాప్తి చేసేందుకు ‘డార్క్ నెట్’ను ఉపయోగిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. గురుగ్రామ్‌లో రెండు రోజుల జీ-20 సదస్సులో అమిత్ షా గురువారం మాట్లాడారు. రాడికల్ చర్యల తీరును అర్ధం చేసుకొని, వాళ్ల ఆట కట్టించేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. సైబర్ దాడి ప్రపంచంలోని అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేస్తోందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు బలమైన, సమర్థవంతమైన కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.డార్క్ నెట్‌లో నడుస్తున్న కార్యకలాపాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం, రిక్రూట్‌మెంట్, శిక్షణను విస్తృతంగా చేసుకునేందుకు మెటావర్స్ కొత్త అవకాశాలు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం, ఆర్థిక వ్యవస్థలను మెటావర్స్ ద్వారా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు పాలన, ప్రజా సంక్షేమంలో డిజిటల్ మార్గాలను ప్రోత్సహిస్తున్నాయన్న అమిత్ షా ప్రజలు డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news