54 దేశాలకు మందులు ఇస్తున్నాం దేనికైనా రెడీ ; కిషన్ రెడ్డి

-

కరోనా తీవ్రతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల అధికారులతో మాట్లాడిన తర్వాతే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని, పెంచే విషయంలో కూడా అందరి నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని, తగ్గించడానికి తాము అన్ని చర్యలు తీసుకున్నాని ఆయన వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన మీడియాతో మాట్లాడారు.

వలస కార్మికులు అందరిని స్వస్థలాలకు తరలిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపుకు 300 రైళ్ళు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణ కు లాక్ డౌన్ పోడిగించాలి అని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం మానవీయ కోణంలో ఆలోచన చేస్తుందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

స్వస్థలాలకు వెళ్ళాలి అనుకునే కార్మికులు, విద్యార్ధులు నోడల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ని సంప్రదించాలని ఆయన సూచించారు. అందరితో చర్చించి అభిప్రాయం తీసుకున్న తర్వాత రెండు వారాలు కావాలి అనుకుని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేసుల తీవ్రత ఆధారంగా జోన్లు గా విభజించామని ఆయన అన్నారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లను కరోనా వారియర్స్ కోసం సిద్దం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

వలస కూలీలు ఎవరూ కూడా రైల్వే స్టేషన్ కి రావొద్దని నోడల్ ఆఫీసర్ గుర్తించి మిమ్మల్ని ప్రత్యేక బస్సుల్లో తరలిస్తామని చెప్పారు. ప్రతీ వ్యక్తి నుంచి 50 టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అని ఆయన అన్నారు. కరోనా ను ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది అని దేశ వ్యాప్తంగా 774 కరోనా ఆస్పత్రులు ఉన్నాయని చెప్పారు.

54 దేశాలకు మందులు అందిస్తున్నామని అన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న కూలీలు ఆ ప్రాంతంలో అధికారులను సంప్రదించాలి అని ఆయన సూచించారు. ప్రత్యేక రైళ్ళలో సామాన్య ప్రజలు ప్రయాణం చేయవద్దు అని ఆయన కోరారు. రెడ్ జోన్ల విషయంలో అన్ని జాగ్రత్తలు రాష్ట్రాలు తీసుకోవాలి అని సూచించారు. 2.5 లక్షల బెడ్లు సిద్దంగా ఉన్నాయని ఐసియు బెడ్లకు కొరత లేదని ఆయన వివరించారు. 27 వేల ఐసియు పడకలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news