సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణపై నిర్వహించిన సమీక్షలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఎ.కె.జైన్‌తోపాటు ఆయన పాల్గొన్నారు. రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలను పూర్తిగా ధునీకరిస్తామని చెప్పారు. పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మూడు దశల్లో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాల్సి ఉందని వాటిని విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు. ‘‘ విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైళ్లు రాబోతున్నాయి. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరాం. 1300కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోంది.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.