కాక్ టెయిల్ మందుపై కేంద్రం పరిశోధనలు

కరోనా చికిత్స విషయంలో ఇప్పుడు చాలా వరకు కీలకమైంది దానికి సమర్ధవంతమైన మందు వెతకడం. ఈ నేపధ్యంలో కేంద్రం కాస్త కీలకంగా కష్టపడుతుంది. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పెట్టుకునే స్వేచ్ఛ రాష్ట్రలదేనని కిషన్ రెడ్డి అన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించుకోవచ్చు అని సూచించారు.

ఆనందయ్య మందును ఏపీ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ పంపితే నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. ఆనందయ్య మందు మాదిరి దేశ నలుమూలల నుంచి వేల విజ్ఞప్తులు వస్తున్నాయి అని తెలిపారు. కాక్ టెయిల్ మందు ఉత్పత్తిపై కేంద్రం పరిశోధనలు జరుపుతోంది అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల బయట కరోనా చికిత్సకు రేట్లు వివరాలను బోర్డులపై ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేసారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు.