అంబర్‌ పేటలో కన్నీరు పెట్టుకున్న కిషన్‌ రెడ్డి

-

జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ సాయంత్రం జన ఆశీర్వాద యాత్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజక వర్గమైన అంబర్‌ పేటకు చేరింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అంబర్‌ పేట, కన్నతల్లిని ఏనాటికీ మరువనని పేర్కొన్నారు. అంబర్ పేట ప్రజల ఆశీర్వాదమే తనను కేంద్ర మంత్రిని చేసిందని… కంటతడి పెట్టుకున్నారు కిషన్‌ రెడ్డి.

దేశం కోసం పని చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏడు సంవత్సరాలలో ఏనాడు కూడా సెలవు పెట్టని ఏకైక ప్రధాన మంత్రి మోడీ అని తెలిపారు. ఏడు సంవత్సరాల్లో ఏనాడు సెక్రటేరియట్ రాని ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎద్దేవా చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని… అమరుల త్యాగాలను మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news