Kiss Day: ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభలున్నాయా?

-

ప్రేమకు చిహ్నం ముద్దు.. ముద్దు అంటే కేవలం మూతులు నాకడం మాత్రమే కాదు. ఎన్నో ఉన్నాయని నిపుణులు అంటున్నారు.ప్రేమ అంటే ఎంత మధరుమో.. ఆ ప్రేమలో ఈ ముద్దు అంతే మధురం మరి.. మరి మద్దు పెట్టుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్లైయింగ్ కిస్, లిప్ లాక్, ఫ్రెంచ్ కిస్, బైట్ కిస్, నెక్ కిస్, పెక్ కిస్.. వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. లెండి. ఇన్ని ముద్దులు.. ముద్దు ముద్దుగా మురిపెంగా ప్రేమికుల్ని దగ్గర చేస్తుంటాయి. అందుకే ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశ్యం లేదా.. అంటూ చాలా మంది పాడుకుంటూనే ఆ తన్మయత్వాన్ని పొందేందుకు తహతహలాడుతుంటారు. మరి ముద్దు వల్ల అసలు కోరిక తీరడమేనా.. ఇంకేమైనా లాభాలు ఉన్నాయంటే మాటలతో చెప్పలేని మధుర జ్ఞాపకాలు.. అవేంటో ఒకసారి చూడండి..

ముద్దు పెట్టుకోవడం వల్ల మీ బ్రెయిన్‌కి మంచి ఫీలింగ్‌ని అందిస్తాయి. దీంతో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్‌లు అందుతాయి.ఇవి స్ట్రెస్ ను తగ్గించి ఆనందాన్ని పొందవచ్చు..ఇది మీ బంధంలో చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మరింత దగ్గరయ్యేందుకు హెల్ప్ అవుతుంది. మీ పార్టనర్‌ని ముద్దు పెట్టుకోవడం వల్ల మీ బంధాన్ని బలంగా మారుస్తుంది.. కోపానికి చెక్ పెట్టేది కూడా ఈ ముద్దే…

ఒత్తిడిని దూరం చేసి, కొత్త ఎనర్జీని నింపుతుంది.. ఇకపోతే పీరియడ్స్ టైమ్‌లో ముద్దు పెట్టుకుంటే.. ఆ సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి రిలీఫ్ అవుతారట. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలు ఈ సమయంలో రిలీజ్ అవుతాయి..అందుకే నొప్పి తగ్గుతుంది.. ఆ సమయంలో వారికి భరించలేని నొప్పి ఉంటుంది..

ముద్దు అనేది శృంగారానికి మొదటి మెట్టు. ఇది పెట్టుకోవడం వల్ల లైంగిక ప్రేరేపణలు పెరుగుతాయి. ఒకరితో లైంగిక సంబంధం కలిగి ఉండాలనే కోరికలని పెంచుతుంది ముద్దు. ఎంత ఎక్కువ సేపు ముద్దుపెట్టుకుంటే అంత ఎక్కువగా టెస్టో స్టెరాన్ రిలీజ్ అవుతుంది.మీరు ఎంత ఎక్కువగా ముద్దుపెట్టుకుంటే ముఖ కండరాలు అంతగా బిగుతుగా మారి టోన్ అవుతాయి. దీని వల్ల ఫేషియల్ కండరాలు, మెడకు మంచిది..ఇమ్యూనిటీ పెరగడంతో పాటు కెలరీలు కరుగుతాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి.. సో మీ ప్రియమైన వారికి ప్రేమగా ఒక ముద్దు ఇవ్వండి.. హ్యాపీ కిస్ డే

Read more RELATED
Recommended to you

Latest news