ఢిల్లీ ఓటమి.. ఎమోషనల్ అయిన రిషబ్ పంత్, షా..

కోల్ కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఓటమి అనంతరం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఈ సారైనా కప్పు కోట్టాలి అనే వారి ఆశలపై నైట్ రైడర్స్ నీళ్లు చల్లారు. చివరి ఓవర్ దాకా దోబూచులాడిన విజయం చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ వశమైంది. అప్పటి వరకు ఢిల్లీ వైపు ఉన్న మ్యాచ్ ను రాహుల్ త్రిపాఠి ఒక్క సిక్స్ తో కోల్ కతా వశం చేశాడు. దీంతో ఎన్నో ఆశలతో లీగ్ ను ప్రారంభించిన ఢిల్లీ కాపిటల్ ప్లేయర్లు ఎమోషన్లతో కన్నీరు పెట్టారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ప్రుథ్వీషా, రిషబ్ పంత్ లు మైదానంలోనే ఏడ్చేశారు.

 ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట్ల్ వైరల్ గా మారాయి. నిన్న జరిగిన మ్యాచ్ లో చివరి రెండు బంతులకు ఆరుపరుగులు చేయాల్సిన దశలో ఢిల్లీ వైపే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే వరస బంతుల్లో మోర్గాన్, నరైన్ వికేట్లు తీసిన అశ్విన్ మ్యాజిక్ చేయబోతాడా… అని అనుకుంటున్న దశలో ఐదోబంతికి త్రిపాఠి సిక్స్ కొట్టి కోల్ కతా ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో నిరాశలో కూరుకుపోవడం ఢిల్లీ వంతైంది.