ఐపీఎల్:ఆ 5పరుగులే ప్లేఆఫ్ రేసులో కోల్ కతా కొంప ముంచాయా…!

-

IPL చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రెచ్చిపోయింది. ముంబైపై ఏకంగా పది వికెట్ల తేడాతో నెగ్గి… ప్లే ఆఫ్‌కు చేరింది. ఓపెనర్లు వార్నర్‌, సాహా అద్భుతంగా ఆడి… 150 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదించారు. ప్లే ఆఫ్ రేసులో చివరి వరకు నిలిచిన నైట్ రైడర్స్ కి మాత్రం నిరాశే మిగిలింది.లీగ్ దశ ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో 14 పాయింట్ల చొప్పున ఉన్నాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న హైదరాబాద్ 0.608 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. -0.172 నెట్ రన్ రేట్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా.. -0.214 నెట్ రన్ రేట్ ఉన్న కోల్‌కతా ఐదోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కేవలం -0.04 అంతరంతో నైట్ రైడర్స్ ప్లేఆఫ్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ముంబై, బెంగళూరుతో జరిగిన 4 మ్యాచ్‌ల్లో కోల్‌కతా చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌ల్లో ఐదు పరుగుల చొప్పున ఎక్కువగా రన్స్ చేసినా.. కోల్‌కతా నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే మెరుగ్గా ఉండేది.. అప్పుడు ప్లేఆఫ్ అవకాశాలు పుష్కలంగా ఉండేవి.

Read more RELATED
Recommended to you

Latest news