సుప్రీం కోర్ట్ ఢిల్లీ వాయు కాలుష్యంపై మరోసారి ఫైర్ అయింది. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. వాయు కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడానికి తీవ్రమైన ప్రణాళికను రూపొందించడానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 24 గంటల గడువు ఇచ్చింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, కోర్టు ఆదేశాలిస్తుందని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు మా భూజాలపై నుంచి బుల్లెట్లు కాల్చలేరని, మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. పాఠశాలలను ఎందుకు మళ్లీ తెరిచారని సుప్రీం కోర్ట్ ఢిల్లీ ప్రభుత్వానికి చురకలు అంటించింది. రేపు ఉదయం 10 గంటలకు వాయుకాలుష్యంపై మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ జరుపనుంది.
వాయు కాలుష్యం చర్యల కోసం మీరు సమగ్రమైన చర్యలు తీసుకోవాలి సుప్రీం కోర్ట్ కేంద్రానికి సూచించింది. ఢిల్లీ కాలుష్యంపై కేంద్రం తరుపున ఢిల్లీలో వాయు కాలుష్యంపై తీసుకుంటున్న చర్యల గురించి సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారు