గులకరాయితో బాబు పై హత్యాయత్నం జరిగిందట?- కొడాలి నాని కౌంటర్

-

టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీమంత్రి కొడాలిి నాని. తనపై రాయి విసిరారని చంద్రబాబు డ్రామా చేస్తున్నాడని ఆరోపించారు. గులకరాయితో చంద్రబాబు పై హత్యాయత్నం జరిగిందట.. అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబే తన పార్టీ కార్యకర్తలతో రాళ్లు వేయించుకున్నాడని ఆరోపించారు కొడాలి నాని. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి.. లేని సమస్యలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

వారిద్దరూ వాళ్ళ సమస్యలతోనే సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఎవరో తాగుబోతులు పవన్ ఇంటి ముందు హడావిడి చేస్తే రెక్కీ చేశారని అన్నారని ఏద్దేవా చేశారు. ఇడుపులపాయలో  హైవే వేయాలంటే పవన్ ప్రధాని అవ్వాలని.. ప్రధాని కావడం కోసం పవన్ కళ్యాణ్, కే ఏ పాల్ తో పోటీ పడుతున్నాడా? అని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రో ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా? దీనిపై ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్ కళ్యాణ్ కి కానీ, చంద్రబాబుకు కానీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news