బాబు మీద కొడాలి నాని దారుణ వ్యాఖ్యలు.. వ్యభిచార గృహాలంటూ !

-

మంత్రి కొడాలి నాని చంద్రబాబుని ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి చిప్పలు, సైకిల్ బెల్లులు ఎత్తుకు పోయిన వ్యక్తులను పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, కనకదుర్గమ్మ ఆశీస్సులతో నే అదే నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలిచి మంత్రి అయ్యారని అన్నారు. క్షుద్రపూజలు చేసి, అవినీతి, అక్రమాలకు పాల్పడబట్టే దుర్గమ్మ తల్లి తండ్రి, కొడుకులకు తగిన శిక్ష విధించిందని, చంద్రబాబు తుప్పుగాడు‌, లోకేష్ పప్పు గాడు అని అన్నారు.

చంద్రగిరిలో 1978లో వ్యభిచార గృహాలు నడిపాడని, అందుకే అక్కడి ప్రజలు ఓడగొట్టారని అన్నారు. నేను పేకాట ఆడించానని చెబుతున్నాడని చంద్రబాబు మగాడు అయితే గుడివాడ వచ్చి పోటీ చెయ్యాలని అన్నారు. చంద్రబాబు కుటుంబం దిక్కు మాలిన కుటుంబం అని అన్నారు. మరో సారి పేకాట ఆడించానని చెబితే ఊరుకోనని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, నా జోలికి వస్తే కుక్క ల వ్యాన్ ఎక్కించి కరెంట్ షాక్ ఇప్పించి మైండ్ సెట్ చేస్తానిన్ అన్నారు. నీ సంగతి చూస్తా అసెంబ్లీలో యూసెలెస్ ఫెలో అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news