పవన్ బీజేపీని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ తిరిగి చంద్రబాబు పంచన చేరే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి పవన్ మద్దతు ప్రకటించారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఫలితం రాలేదని ఆయన అన్నారు. నాలుగు లక్షల మెజార్టీతో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.
జగన్నాధ రథ చక్రాలను ఐదు కోట్ల ఆంధ్రులు లాగుతున్నారు.. అడ్డం వస్తే నలిగిపోతారని అన్నారు. చంద్రబాబు, లోకేషుకు సిగ్గు శరం ఉంటే.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో అడుగు పెట్టకూడదని అన్నారు. జనానికేం కావాలో జగన్ కి తెలుసు.. జగన్ కి ఏం కావాలో జనానికి తెలుసని అన్నారు. చంద్రబాబుకు ఈ ఫలితం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, లోకేషులను తన్ని తరిమేశారని, చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టారు.. అయినా మర్నాడే దిగిపోతాడని అన్నారు.