వేసవిలో మీ చర్మ సంరక్షణ కోసం రోజ్ వాటర్ ని ఎంపిక చేసుకుంటే కలిగే లాభాలు..

-

రుతువు మారితే చర్మంలో మార్పులు రావడం సహజమే. చలికాలంలో చర్మ సమస్యలు ఎంతగా ఇబ్బంది పెడతాయో వేసవిలోనూ ఈ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో ముఖ్యంగా చర్మం ఎర్రగా మారడం, దురద వంటి అలర్జీలు రావడం సాధారణమే. ఐతే వాటి నుండి రక్షణ పొందడానికి మీ స్కిన్ కేర్ లో రోజ్ వాటర్ ని యాడ్ చేసుకోండి. అవును, రోజ్ వాటర్ మీ చర్మ పీహెచ్ బ్యాలన్స్ ని సరిగ్గా ఉపయోగించి చర్మానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది.

వేసవిలో రోజ్ వాటర్ ని చర్మ సాధనంగా వాడితే కలిగే లాభాల్లో కొన్ని తెలుసుకుందాం.

నల్లమచ్చలు, తెల్లమచ్చలు, మొటిమలు, గీతలు ఏర్పడకుండా సాయపడుతుంది. వయసు పెరిగినట్టు కనిపించేలా చేసే చాలా వాటిని తొలగించి ముడుతలు ఏర్పడకుండా చూసుకుంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి మంచి మూడ్ ని కలుగజేస్తుంది. దానివల్ల చిరాకు వంటివి దూరమవుతాయి.

వేడి పెరుగుతున్న కొలది చర్మం చిరాకుకి గురవుతుంది. తాజాగా ఉండాలంటే ముఖాన్ని నీళ్ళతో శుభ్రంగా కడుక్కుని రోజ్ వాటర్ ని మర్దన చేసుకుంటే సరిపోతుంది. రోజ్ వాటర్ ని ఎప్పుడు పెట్టుకున్నా ముందుగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. రోజ్ వాటర్ ని చిన్న బట్ట తీసుకుని ముఖానికి అద్దుకున్నా సరిపోతుంది. లేదా డైరెక్టుగా ముఖానికి స్ప్రే చేసినా ఫర్వాలేదు. ఎలా అయినా ఇది బాగా పనిచేస్తుంది.

వేడి ఎక్కువగా ఉండడం వల్ల నెత్తిమీద ఏమీ లేకుండా ఎండిపోతుంది. అప్పుడు రోజ్ వాటర్ ని అప్లై చేస్తే అలా జరగకుండా ఉంటుంది. జుట్టులో చుండ్రు పెరగకుండా ఉండేందుకు కూడా రోజ్ వాటర్ పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news