నిమ్మగడ్డ ఒక మెంటల్ కేసు.. కొడాలి నాని సంచలనం !

-

గత కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎలా అయినా ఎన్నికలు జరిపి తీరాలని నిమ్మగడ్డ ఆయన ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డ రమేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా ఛానల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు కామెంట్ చేశారు.

నిమ్మగడ్డ రమేష్ ఒక మెంటల్ కేసు అని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ వింటూ ఉండడంతో ఆయనకు మతిభ్రమించింది అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక సారి వెళ్లి ఎర్రగడ్డలో టెస్ట్ చేయించుకుంటే ఈ విషయం కూడా తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2018లో నిర్వహించాల్సిన ఎన్నికలను 2019 వరకు నిర్వహించలేక పోయారు అని ఎన్నికలు నిర్వహించాలని జగన్ కోరితే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఆ రెండేళ్లపాటు ఎందుకు ఎన్నికల నిలుపుదల చేశారు అనే విషయం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news