కన్నకూతురిని ఒక మహిళ సుపారీ ఇచ్చి మరీ చంపించిన ఘటన ఒడిశాలో సంచలనం రేపింది. తన 36 ఏళ్ల కుమార్తె హత్యకు సంబంధించి ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఒక మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితురాలు సుకురిగిరి (58) తన కుమార్తెను చంపడానికి ముగ్గురు వ్యక్తులతో సుపారీ మాట్లాడుకున్నాడు. రూ.50 వేలకు తన కుమార్తెను చంపమని కోరగా అందుకు ఒప్పుకున్న ముగ్గురు నిందితులు ఆమెను చంపారు.
అందులో ప్రమోద్ జెనా (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని బాలసోర్ సదర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ప్రవాష్ పాల్ తెలిపారు. నిజానికి గిరి కుమార్తె షిబానీ నాయక్ (36) అక్రమ మద్యం వ్యాపారం చేసిననట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది, ఈ కారణంగా వారి సంబంధం చెడిపోయింది. తన కుమార్తెను అక్రమ మద్యం వ్యాపారం నుండి నిరోధించడానికి సుకురి చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేక పోవడంతో, నాయక్ ని చంపడానికి ఆమె నిర్ణయించుకుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుకురి రూ .8 వేల అడ్వాన్స్ ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.