BREAKING : బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష

-

మునుగోడు ఉప ఎన్నికలు చాలా రవసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, ప్రోఫెసర్‌ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బుద్ధ భవన్ లో కోదండరాం మౌన దీక్ష కు దిగారు.

తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రోఫెసర్‌ కోదండరాం. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘన పై కోదండరాం మౌన దీక్ష కు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహించారు కోదండరాం. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరుగాలని కోరారు కోదండరాం.

Read more RELATED
Recommended to you

Latest news