మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పై బీసీసీఐ మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోవడం సరైనా నిర్ణయమే అని రవి శాస్త్రి అన్నారు. విరాట్ కోహ్లి.. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం వల్ల ప్రస్తుతం ఐపీఎల్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతాడని అన్నాడు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం అయ్యే ఐపీఎల్ మ్యాచ్ లలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చూడటానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.
అయితే విరాట్ కోహ్లి.. మరో సారి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని తాను కోరుకుంటున్నాని వెల్లడించాడు. కాగ విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని అన్నారు. అందుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించిన టెస్టు మ్యాచ్ రికార్డులను చూస్తే సరిపోతుందని అన్నారు. కాగ ఇటీవల విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ తో పాటు అన్ని ఫార్మెట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలేంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.