చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి మృతి

-

వరుస విషాదాలు చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చిత్ర పరిశ్రమకు దూరం కాగా.. తాజాగా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ నటి నల్లె నై చిత్ర ( 56 ) శని వారం ఉదయం మృతి చెందారు. గుండె పోటు తో చిత్ర తన నివాసం లోనే తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

బాల నటిగా పరిశ్రమలోకి చిత్ర అడుగు పెట్టారు. 1980-90 మధ్ కాలంలో పలు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. వడక్కన్‌ వీరగాథ, పరంపర, కలిక్కలం, రాజవచ్చ తదితర మల యాళ సినిమాలు చిత్కకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇటీవల సినిమాలకు దూరమైన చిత్ర తమిళ సీరియల్స్‌ తో బిజీ అయ్యారు. ఆమెకు భర్త విజయ రాఘవన్‌, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. ఇక చిత్ర మృతి పట్లు పలుగురు కోలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.రేపు ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news