విగ్నేష్ శివన్ కి షాక్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ అజిత్..!

-

కోలీవుడ్లో వన్ ఆఫ్ ద స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నట్టే ఉంటారు. ఇక తన జోన్ లో తన ప్రైవేట్ లైఫ్ లో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. సినిమాలకు ఓకే చెప్పామా.. చేసామా తర్వాత తన బైక్ రైడ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్లొద్దామా అన్నట్టే ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. చాలా సింపుల్ అండ్ సైలెంట్ నేచర్ తో కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నారు.

కానీ కోపం వస్తే మాత్రం ఎవరూ ఊహించని విధంగా అనుకున్నది చేసి చూపిస్తారు అజిత్. అలా తాజాగా తన నెక్స్ట్ ఫిలిం కి ముహూర్తం పెట్టేశారు. అందరూ అనుకున్నట్టుగానే నయనతార భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి బిగ్ షాక్ ఇచ్చారు అజిత్. నయన్ భర్త విగ్నేష్.. అజిత్.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేద్దామని అనుకున్నారు. అయితే అజిత్ దగ్గర కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ అనుకున్న సమయానికి విగ్నేష్ స్టోరీ రెడీ చేయకపోవడం అప్పటికే రెడీ అయిన స్టోరీ అజిత్ కు నచ్చకపోవడంతో విగ్నేష్ తో చేయడం ఇష్టం లేదని మొహమాటం లేకుండా చెప్పారు అజిత్.

దీంతో డిప్రెషన్ కి లోనయ్యారు విగ్నేష్..తన భర్త పరిస్థితిని చూసినందు.. అజిత్ తో మాట్లాడే ప్రయత్నించి విఫలమయ్యారట. చేసేదేం లేక అజిత్ పై విమర్శలు కూడా చేశారు. ఇక ఇద్దరు సినిమా నుంచి తప్పుకున్నారు. కానీ విగ్నేష్ శివన్ చూస్తుండగానే అదే లైకా బ్యానర్లో మరో డైరెక్టర్ మగిళ తిరుమేణి తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో తన 62వ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో మొదలుపెట్టబోతున్నారట. ఏది ఏమైనా విగ్నేష్ పని అయిపోయినట్టే అని వార్త వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news