వారికి కేంద్రం శుభవార్త..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. సామాన్యులకు మోదీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెడితే చక్కటి రాబడి వస్తుందని చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇప్పుడు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ లో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందొచ్చు.

మోదీ ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్ల దాకా పెంచింది. ఇప్పుడు కనుక మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ లో పెట్టుబడి పెడితే దాని ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. మోదీ ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 70 బేసిస్ పాయింట్లు ని పెంచింది. అంటే 0.70 శాతం వరకు పెంచింది. ఏప్రిల్ నుంచి జూన్ 2023 త్రైమాసికంలో ఈ పెరుగుదల వచ్చింది. దీని కోసం మార్చి 31, 2023న ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర స్కీముల వడ్డీ రేట్లు పెరిగాయి. 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.8 శాతానికి పెరిగింది. రెండేళ్ల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ 3 సంవత్సరాల కి అయితే 6.9 శాతానికి బదులుగా 7.0 శాతం వడ్డీని ఇస్తుంది. అదే ఐదేళ్లకి చూస్తే 7.0 శాతం నుండి 7.5 శాతానికి పెరిగింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన వాటికి 5.8 శాతానికి బదులుగా 6.2 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారికి వడ్డీ 8.0 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news