తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బిఆర్‌ఎస్, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ పోరులో ఊహించని ట్విస్ట్ లు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్, బిజేపిలు ఫైట్ చేస్తున్నాయి.
అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిపై బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంపై పోరులో ప్రతిపక్షాలని ఏకం చేసి ముందుకెళ్లాలని కేసిఆర్ చూస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ తో కలిసే అవకాశం కూడా ఉందని ప్రచారం నడుస్తోంది. పొత్తు కూడా ఉంటుందని ప్రచారం వస్తుంది. కానీ రాష్ట్రంలో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసిఆర్‌ని గద్దె దించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాకపోతే కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి అందుకు భిన్నంగా ఉంది. కొందరు కేసిఆర్‌కు అనుకూలంగా వ్యవాహరిస్తున్నారనే అనుమానం ఎప్పటినుంచో ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత జానారెడ్డి..బిఆర్‌ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండే ఛాన్స్ కూడా ఉందన్నట్లు మాట్లాడటం సంచలనంగా మారింది..ఆ తర్వాత పొత్తు ఉంటుందని తాను చెప్పడం లేదని జానారెడ్డి వివరణ ఇచ్చారు. కానీ ఎలా చెప్పిన..ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఒకటే అని బిజేపి ప్రచారం చేస్తుంది. ఇలాంటి సమయంలో పొత్తుల గురించి మాట్లాడటం వల్ల..ఇంకా బిజేపికి ఆయుధం అందించినట్లు అవుతుంది.
దీని వల్ల ప్రజల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనే భావన వెళ్ళిందంటే బిజేపికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ దిశగానే బిజేపి పావులు కదిపే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏదేమైనా గాని పొత్తులు మాత్రం ఉండే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదనే చెప్పాలి. మరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏమైనా సీన్ మారుతుందేమో చూడాలి.