పెళ్లి వార్తలపై గట్టి కౌంటర్ ఇచ్చిన కొమరంపులి హీరోయిన్..!!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో నికీషా పటేల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో నికీషా పటేల్ తన అంద చందాలతో అభిమానులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి . ఈ క్రమంలోనే ఓం 3D, గుంటూరు టాకీస్ 2 సినిమాలలో కూడా కనిపించింది . అయితే ఈ సినిమాలేవి కూడా ఈమెకు స్టార్ డంను తీసుకురాలేకపోవడం గమనార్హం. అదే సమయంలో ఈమెకు తమిళ్ ,కన్నడ సినిమాలలో వరుసగా ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇతర భాష సినిమాల పైన దృష్టి పెట్టింది.

అయితే అక్కడ కూడా ఈమెకు సరైన హిట్స్ రాలేదు దీంతో ఈ భామ సినిమాలకు బ్రేక్ చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తనకు నచ్చలేదు అని చెప్పి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక విదేశీయుడుతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కథనాలుగా వెలుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెళ్లి కొడుకు ఎవరు? అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా దీపావళి సందర్భంగా నికిషా పటేల్ ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దీనితో నికిషా పటేల్ కు కాబోయే భర్త అతడేనా ? అంటూ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటోను మంగళవారం సాయంత్రానికి డిలీట్ చేసిన ఈమె ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చింది.. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని .. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను తన ఇన్స్టాలో జోడించి ఫాల్స్ న్యూస్ అంటూ చెప్పింది. అయితే తనతో ఉన్న ఆ విదేశీయుడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news