నా రాజీనామాతోనే సర్కార్ లో కదలిక : రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయం అగ్గి రాజుకుంటోంది. ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు.

నా రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నా రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్‌ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. అందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు. నా రాజీనామాతోనే ఫండ్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోంది. ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్‌ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు.

మునుగోడు ప్రజలు తనను కాపాడుకుని.. కడుపులో పెట్టుకుంటారన్న నమ్మకం తనకుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తీర్పు తెలంగాణలో చరిత్రాత్మకంగా ఉంటుందని చెప్పారు. కొన్ని పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు డబ్బు సంచులతో వస్తారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news