BRS కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదు: కోమటిరెడ్డి

-

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు అనుకూలంగా సీటును కేటాయించలేదని అసంతృప్తితో మల్లె తిరిగి సొంతగూటికి చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం గా బీజేపీని ప్రహాలు అస్సలు అనుకోవడం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కేసీఆర్ కు అన్నివేళలా బీజేపీ నుండి అందాల్సిన సపోర్ట్ అందుతోందని చెప్పారు, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే లిక్కర్ స్కాం లో ఉన్న కవితను అరెస్ట్ చేయకుండా తప్పించడం అంటూ చెప్పారు కోమటిరెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు.

జీవితాంతం బీజేపీలోనే ఉండాలనుకున్నా కానీ.. ఇక్కడ అందరికీ అనుకూలంగా ఉండదని తెలుసుకుని మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తున్న అంటూ బాధతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపాడు. ఇక ఈయన కాంగ్రెస్ నుండి మునుగోడు లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news