దమ్ముంటే కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలి : రాజగోపాల్ రెడ్డి

-

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా చాలా పార్టీల నుంచి వ్యక్తులు ఇతర పార్టీలలోకి వలస వస్తున్నారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ లో నల్గొండ వాసులు చాలా మంది ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, లోకల్ కార్పొరేటర్లు ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు.

మీడియానే రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసింది. దయచేసి ఇలా రూమర్స్ క్రియేట్ చేయకూడదని మీడియాను వేడుకున్నారు. కేసీఆర్
దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని.. తన కొడుకును సీఎం చేసేందుకు ఆరాటపడుతున్నాడు. డబ్బు అధికారంతో మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అధిష్టానంలో గజ్వేల్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే.. కేసీఆర్ కి రిటర్న్ గిప్ట్ ఇస్తానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే.. గజ్వేల్ లో పోటీ చేస్తానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే మునుగోడులో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లానని అన్నారు. అప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news