చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ, సోషల్ మీడియాలో ఓ కాల్ రికార్డింగ్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ కాల్ రికార్డింగ్ లో చెరుకు సుధాకర్ ను చంపేస్తామంటూ ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి.
కాల్ రికార్డింగ్ లో చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేసేందుకు వంద వెహికిల్స్ లో తిరుగుతున్నారని, వదిలిపెట్టరంటూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గా చెప్తున్న వ్యక్తి వార్నింగ్ ఇచ్చారు. తీవ్రస్థాయిలో బూతులు మాట్లాడుతూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కాగా, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై చెరుకు సుధాకర్ విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి, ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చెరుకు సుధాకర్
ఒక ఉద్యమకారుడు
ఉద్యమంలో జైలుకు పోయినోడు
పీడీ యాక్ట్ పెట్టినా అదరనోడు
తెలంగాణ కోసం ఎత్తినజెండా దించనోడుఅదే నువ్వు
తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే..
కాంట్రాక్టులు తీసుకోని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టినోడివి
మన నీళ్లను ఎత్కపోయినోడి బొక్కలకు ఆశపడ్డోళ్లు మీరునువ్వు… https://t.co/vnt3UhjA6R pic.twitter.com/Zuz921LE3s
— Journalist Shankar (@shankar_journo) March 5, 2023