వామ్మో.. 13యేళ్లకే అలాంటి పని చేసిన విశ్వక్ సేన్. షాక్ లో ఫ్యాన్స్..!

-

సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం దాస్ కా ధమ్కీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో పడ్డారు. చివరిగా ఓరి దేవుడా అనే రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. తన నటన తో అందరిని మెప్పించిన ఆయన అంతకుముందు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా కూడా విశ్వక్ సేన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇకపోతే ఈమధ్య కాలంలో విశ్వక్ సేన్ నటించే ప్రతి సినిమా కూడా మినిమం గ్యారెంటీ అని ట్యాగ్ తెచ్చుకుంది.

ఇదంతా బాగానే ఉన్నా ఆయన బిహేవియర్, ఆటిట్యూడ్ మీద ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా అర్జున్ సర్జా తన కూతుర్ని తెలుగులో పరిచయం చేయాలని విశ్వక్ సేన్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. కానీ సినిమా షూటింగ్ ప్రారంభం రోజే విశ్వక్ సేన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. సినిమా ఆగిపోయింది. అర్జున్ తన సినిమా నుండీ విశ్వక్ ను తీసేసాడు. మొత్తానికి అర్జున్ ఇప్పుడు ఇంకో హీరోను వెతుక్కునే పనిలో వుండగా.. విశ్వక్ సేన్ తన సినిమాలను పూర్తి చేసుకునే పనిలో పడ్డాడు.

ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ తాజాగా ఒక ఫోటోను షేర్ చేశాడు . 13 ఏళ్ల వయసులోనే తాను యానిమేషన్ కోర్సును నేర్చుకున్నాను అంటూ నాటి ఐడి కార్డును చూపించాడు. అందులో విశ్వక్ సేన్ తన పేరు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు అన్న విషయం తెలిసిందే. కానీ ఆ పేరు కలిసి రావడం లేదని ఆయన విశ్వక్ సేన్ గా తన పేరును మార్చుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news