ఇంటికి పోతరా.. జైలు కు పోతరా : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా హైదరాబాద్ కొచ్చారు.. అందరు స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు సభకు తరలి రావాలన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఇవాళ హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పతనం మొదలైందని, ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదన్నారు. అప్పుల రాష్ట్రాన్ని బాగుచేసుకునే బాధ్యత అందరి పై వుందని, ప్రజలు విజయభేరి సభకు తరలి రావాలన్నారు. బీజేపీ లేదు, బీఆర్ఎస్ ఓడిపోతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leaked audio has Congress leader Venkat Reddy asking colleagues to vote for  BJP-nominee brother in Munugode - The South First

అంతేకాకుండా.. ‘కేటీఆర్ కు ఏం తెల్సు తెలంగాణ ఉద్యమం గురించి. అసలు కేటీఆర్‌ అప్పుడు ఎక్కడున్నాడు.. ఫ్లోరైడ్ సమస్య తో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు. మూసీ ప్రక్షాళన ఏమైంది
చింతమడక లో ఇంటికి 10లక్షలు ఇస్తావ్.. మరి ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇయ్యవ్. రేపు సభలో చెబుతాం .. మేము ఏం చేసేదో.. చేసేదే చెబుతాం. తెలంగాణ ద్రోహులను మంత్రి వర్గంలో పెట్టుకున్నావు. 90 రోజుల్లో బిఆర్ఎస్ నేతలు ఎక్కడికి పోతరో .. చూద్దాం. ఇంటికి పోతరా.. జైలు కు పోతరా.. ఒకటో తారికి జీతం ఇయ్యని సర్కార్ కేసీఆర్ సర్కార్ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోతే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావ్. మేము అధికారంలోకి వచ్చాక అన్ని చేస్తాం.’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news