వైసీపీని తక్కువ అంచనా వేయొద్దు : పవన్‌ కల్యాణ్

-

2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు.

Pawan Kalyan: Officials who are blowing the horn of the government should  be ashamed: Pawan Kalyan

టీడీపీ పొత్తుపై జనసేన విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి దారి తీసిన కారణాలను తీర్మానంలో వివరించిన జనసేన.. బీజేపీ కూడా జనసేన – టీడీపీతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జీ-20 సదస్సు విజయవంతం చేసిన ప్రధానిని అభినందిస్తూ మరో తీర్మానం. మన సమకాలికులను, ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయొద్దు… చంద్రబాబు జైల్లో ఉన్నారని తెలుగుదేశం నేతలను కించపరచవద్దు.. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవ్వరూ వ్యవహరించొద్దు.. రాహుల్ గాంధీని పప్పు పప్పు అని విమర్శించారు.. కానీ అదే రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు.. నేను కాంగ్రెస్ మద్దతు దారును కాను, కానీ ఎదుటి పక్షాన్ని తక్కువ అంచనా వేయొద్దనే చెబుతున్నా.. కాంగ్రెస్ కూటమిని నేను తక్కువ అంచనా వేయడం లేదు.. వైసీపీని తక్కువ అంచనా వేయొద్దు.’ పవన్‌ కల్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news