అక్రమ అరెస్టు చేయించిన‌ సిగ్గులేని జ‌న్మ నీది : లోకేశ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 42 వేల కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నం దోచేసి 38 కేసుల్లో ఏ1 గా ఉండి చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్టు చేయించిన‌ సిగ్గులేని జ‌న్మ నీది అంటూ మండిపడ్డారు. ములాఖ‌త్-మిలాఖ‌త్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నావు… చంచ‌ల్ గూడలో నీ ములాఖ‌త్ లు మ‌రిచిపోయిన‌ట్టున్నావు అంటూ ఎద్దేవా చేశారు.

TDP National General Secretary Nara Lokesh Interview: 'నా తండ్రి ఏ తప్పూ  చేయలేదు.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు మేమే గెలుస్తాం',  tdp-national-general-secretary-nara ...

“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అని ఉర్దూలో ఒక సామెత ఉంది. ఒక మహా ముదురు దొంగ మంచి పోలీసును దొంగ దొంగ అంటూ తరిమాడన్నది దాని అర్థం. గ‌జ‌దొంగ జ‌గ‌న్ తీరు చూస్తే అలాగే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మా టీడీపీని ఓడించ‌డానికి తెర‌వెనుక అయిన మిలాఖ‌త్‌లు నీకు గుర్తులేక‌పోవ‌చ్చు.

అవినీతిప‌రుడైన‌వాడు నీతిమంతుల‌కి అవినీతిని అంట‌క‌ట్ట‌డం ఒక మానసిక రుగ్మ‌త‌. దీనినే Megalomania disorder అంటారు. బాబుగారిని అరెస్టు చేయించేందుకు లండ‌న్‌లో దాక్కున్న ప‌దిరోజుల‌లో నీ ఈ మాన‌సిక రుగ్మ‌త‌కి వైద్యం చేయించుకోవాల్సింది గ‌జ‌దొంగ జ‌గ‌న్! అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వా నీతి క‌బుర్లు చెప్పేది?