హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. బిజెపి నుండి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అలాగే టిఆర్ఎస్ నుండి ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించిన గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ ను నిలబెట్టాలని తెలంగాణ పిసిసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ వరంగల్ లో కీలక నేతగా ఎదిగారు. అంతేకాకుండా పద్మశాలి మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు సురేఖ కు పడతాయని పిసిసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కృష్ణారెడ్డి, కమలాకర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. చివరికి కాంగ్రెస్ హుజూరాబాద్ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.