హన్మకొండ ; వరంగల్, హన్మకొండ జిల్లాలు గా పేర్లు మార్చుతూ ఫైనల్ జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 13 మండలాలతో వరంగల్ జిల్లా ను విభజించిన తెలంగాణ సర్కార్.. 14 మండలాలతో హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక వరంగల్ జిల్లాల ఏర్పాటు సందర్భంగా సీఎం కెసీఆర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ జీఓ జారీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని.. చారిత్రక ప్రదేశాలకు చక్కని గుర్తింపు వస్తుందని తెలిపారు మంత్రి దయాకర్ రావు. వరంగల్, హన్మకొండ మార్చుతూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇక్కడి ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు.