క్లారిటీ లేని కల్యాణ్… కనీసం అవి సెట్ చేసుకోవచ్చుగా!

-

పవన్ కల్యాణ్‌కు సినిమా పరంగా గానీ…రాజకీయ పరంగా గానీ ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. అయితే సినిమాల్లో సక్సెస్ అయినట్లు…రాజకీయాల్లో పవన్ సక్సెస్ కాలేకపోయారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఏదో అగ్రెసివ్‌గా స్పీచ్‌లు ఇచ్చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని తిట్టేస్తే సరిపోదు. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపాలి….ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి…అలాగే రాజకీయంగా అధికార పార్టీని టార్గెట్ చేయాలి.

pawan-kalyan
pawan-kalyan

వీటిల్లో ఏ మాత్రం తప్పు లేదు. కానీ అవే చేస్తూ…పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయకపోవడం అనేది అతి పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఇంచార్జ్‌లు లేరు. 175 కాదు…కనీసం గత ఎన్నికల్లో జనసేనకు ఓట్లు బాగా పడిన నియోజకవర్గాల్లో కూడా సరైన నాయకులు లేరు. అలాంటప్పుడు పవన్ రాజకీయం ఎంత రచ్చ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది.

రాజకీయం చేస్తూనే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముంది. అసలు పవన్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారో కూడా క్లారిటీ లేదు….గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు…మళ్ళీ ఆ రెండు స్థానాల్లో పోటీ చేస్తారా? లేక ఒకచోటే పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటినుంచే ఒక నియోజకవర్గం ఫిక్స్ అయ్యి…అక్కడ జనసేనని బలోపేతం చేసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అంతే సంగతులు.

అలాగే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని పెట్టుకుని ఇంకా బలపడాలి. టి‌డి‌పితో పొత్తు ఉంటుందా?లేదా? అనేది తర్వాత అంశం…ముందు నియోజకవర్గాల్లో పార్టీ బలపడలేదు. ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంటే….పొత్తులో భాగంగా ఆ సీట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సీట్లు ఇచ్చేయమంటే టి‌డి‌పి ఇచ్చేయదు. ఒకవేళ పొత్తు లేకపోతే ఇంకా ఎక్కువగా బలపడాల్సి ఉంటుంది. కానీ పవన్ అవేమీ చేయకుండా రాజకీయం చేస్తే పావలా ఉపయోగం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news