బిజెపికే మా ప్రభుత్వం మద్దతు.. అందుకే ప్రభుత్వం నడుస్తోందని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజేపికి వైసిపి మద్దతు ఇస్తూంది అన్న విషయంలో దాపరికం లేదని వెల్లడించారు.
గత మూడు సంవత్సరాలుగా బిజేపి బిల్లులుకు మద్దతు ఇస్తూనందు వలనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్దికంగా మద్దతు లభిస్తూందని చెప్పారు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్. ఇక సాధించవలసిందల్లా ప్రత్యేక హోదానే అని పేర్కొన్నారు. 2024 లో వైసిపికి హోదా సాధించేందుకు మంచి అవకాశం లభిస్తూందని ఆశిస్తూన్నామని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరిస్తారని స్పష్టం చేశారు.