భర్త కనిపించడం లేదని భార్య కంప్లైంట్.. కాల్ రికార్డ్ చెక్ చేయగా?

తన భర్త కనిపించడం లేదని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా సదరు మహిళను పలు పశ్నలు అడిగారు. దీంతో ఆమె భయపడుతూ.. పొంతన లేని జవాబులు చెప్పుకొచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

భార్య-భర్త-హత్య
భార్య-భర్త-హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మిర్జాపూర్‌కు చెందిన సావిత్రి అనే మహిళ జూన్‌ 28వ తేదీన తన భర్త బల్లూ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మరుసటి రోజు గ్రామానికి స్థానికంగా ఉన్న ఓ పొలంలో బల్లూ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణలో భాగంగా సావిత్రిని పలు ప్రశ్నలు అడిగారు. ఆమెపై అనుమానం రావడంతో తన ఫోన్ డేటాను చెక్ చేశారు. రక్వార్ అనే వ్యక్తితో తరచూ ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో సావిత్రి, రక్వాల్‌ను విడివిడిగా విచారణ జరిపారు. నాలుగేళ్ల నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని, ఇద్దరూ కలిసి ఉండాలని అనుకున్నట్లు తేలింది. అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేశారు. మద్యం తాగించి కొంతు కేసి చంపేశారని పోలీసులు తెలిపారు.