తెలంగాణ రాజకీయాల్లో పోరు..మూడు పార్టీల మధ్య జరుగుతుందని చెప్పడం కంటే..ముగ్గురు నాయకుల మధ్య జరుగుతుందనే చెప్పాలి. అది కూడా సిఎం రేసులో ఉన్న అభ్యర్ధుల మధ్య జరుగుతుంది. ఎలాగో కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడంతో భవిష్యత్ లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీని నడిపించేది కేటిఆర్ అని అందరికీ అర్ధమవుతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సిఎం అవుతారని తెలిసిపోతుంది.
ఇటు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా సరే టిపిసిసి పదవి దక్కించుకుని రేవంత్ దూకుడుగా వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిఎం అభ్యర్ధి రేసులో ఆయనే ముందు ఉన్నారు. ఇక బీజేపీలో బండి సంజయ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బిజేపి బలం పెరుగుతూ వచ్చింది. ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇలా ముగ్గురు కీలక నేతలు ఇప్పుడు తమ తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు నేతల మధ్యే వార్ నడుస్తుంది.
అయితే ప్రతిపక్షంలో ఉండటంతో ఇటు రేవంత్..అటు బండి..అధికారంలో ఉన్న కేటిఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. ఆయన టార్గెట్ గానే రాజకీయం నడిపిస్తున్నారు..రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇక కేటిఆర్ కూడా వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసు లో రేవంత్, బండి..కేటిఆర్ టార్గెట్ గానే ఆరోపణలు చేస్తున్నారు. కేటిఆర్ సన్నిహితులు ఈ కేసులో ఉన్నారని ఆరోపిస్తున్నారు.
అయితే అధికారం చేతులో ఉండటంతో సిట్..రేవంత్, బండిలకు నోటీసులు ఇచ్చింది..ఆధారాలు ఉంటే ఇవ్వాలని అడిగింది. ఇది సిట్ ద్వారా కేటిఆర్ కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కేటిఆర్ లీగల్ కూడా ముందుకెళ్లారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపిచారు. ఇలా చేయడం ద్వారా రాజకీయ యుద్ధం రేవంత్-బండి తోనే ఉందని కేటిఆర్ చెప్పకనే చెప్పారు.