నేడు కృష్ణ దశదినకర్మ.. ముఖ్య అతిథులు వీరే..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన తెరకెక్కించిన సినిమాలు.. చేసిన కృషి ఎప్పుడు మనతోనే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ.. వారిని మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవాళ కృష్ణ దశదినకర్మ.. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.

నేడు ఎన్ కన్వెన్షన్ దగ్గర హైదరాబాదులో ఈ కార్యక్రమం జరిగే చోట కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉన్నారో అలాంటి విగ్రహాన్ని తయారు చేశారు..ఈ ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్యను కూడా కోల్పోవడం ఆయనను మరింత మనోవేదనకు గురించేసింది. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఇటీవల పెట్టిన ఒక పోస్ట్ కూడా అందరి హృదయాలను కదిలించింది అని చెప్పవచ్చు. తీవ్ర దుఃఖంలో ఉన్న మహేష్ బాబు తన తండ్రికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి మరియు చూసుకుంటూ ఉండడం గమనార్హం.

అయితే సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీన తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ కాంటినెంటల్ లో చేరి చికిత్స పొందుతూ అక్కడే తుదీశ్వాస విడిచారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కృష్ణ మరణం యావత్ సినీ ఇండస్ట్రీని సోకసంద్రంలో ముంచేసింది. కృష్ణా మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కూడా తీరని లోకం మిగిలింది. ముఖ్యంగా ఇప్పటికే ఆయన లేని విషయాన్ని ఎవరు నమ్మలేకపోతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news